శ్రీ ఆహోబిల మఠం
గద్వాల, తెలంగాణ, భారతదేశం
Sri Ahobila Matha emblem

ప్రదోష పుష్ప యాగం • దోలోత్సవం • వింజామర సేవ

ప్రతి ప్రదోషం

"శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి సన్నిధిలో పుష్పాలను సమర్పించి, ప్రదోష వేళ జరిగే పవిత్ర కైంకర్యంలో భాగస్వాములవుదాం."

Video thumbnail

ప్రదోష వేళ శ్రీ లక్ష్మీనృసింహ స్వామివారి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ సేవలో బుక్ చేసుకున్న భక్తుల పేరున సుమారు ఐదు కిలోల పుష్పాలను స్వామివారి హృదయభాగం వరకు అలంకరించే విధంగా సమర్పిస్తారు. అనంతరం డోలోత్సవం, వింజామర సేవ నిర్వహించబడతాయి. ఈ సేవను బుక్ చేసుకున్న భక్తులకు పుష్ప ప్రసాదంతో పాటు ప్రదోష పానక ప్రసాదం అందజేయబడుతుంది.

సేవ ప్రత్యేకతలు

  • • పుష్పయాగం: భక్తుని పేరున సుమారు ఐదు కిలోల పుష్ప సమర్పణ.
  • • పుష్పాలంకరణ: స్వామివారి హృదయభాగం వరకు పుష్పాలతో అలంకరణ.
  • • డోలోత్సవం: ప్రదోష ఆరాధనలో భాగంగా స్వామివారికి ఉయ్యాల సేవ.
  • • వింజామర సేవ: స్వామివారికి సంప్రదాయబద్ధంగా వింజామర కైంకర్యం.

భక్తులకు లభించేవి

  • ఈ సేవను బుక్ చేసుకున్న భక్తులకు:
  • • పుష్ప సమర్పణకు సంబంధించిన పుష్ప ప్రసాదం.
  • • విశేష ప్రదోష పానక ప్రసాదం.
  • • తమ పేరున పుష్పయాగం సమర్పించే అవకాశం.
  • • ప్రదోష డోలోత్సవం, వింజామర కైంకర్యంలో భాగస్వాములయ్యే అవకాశం.

"మీరు చదివి మీకు నచ్చితే షేర్ చేయవచ్చు"

v121303
ప్రదోష పుష్ప యాగం • దోలోత్సవం • వింజామర సేవ | Sri Ahobila Matha Gadwal